MBNR: పట్టణంలో బుధవారం అనారోగ్య కారణాలతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భూత్పూర్ గ్రామానికి చెందిన కంపిల చరణ్ (20) వెన్నెముక నొప్పితో బాధపడుతూ, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. తోటి పనివారు లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.