ELR: ప్రజల భూములను ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులు 22A జాబితాలో చేర్చారని, అలా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం ఆదేశించారు. 22A జాబితాలో చేర్చిన భూముల అభ్యంతరాలపై అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పేదల ఇళ్ల కాలనీలకు విద్యుత్, నీరు, రహదారి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.