GNTR: భార్య మృతికి కారణమైన భర్తకు గుంటూరు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మేడికొండూరు మండలం సిరిపురంలో 2015లో హరికృష్ణ వేధింపులు తాళలేక భార్య ఆదిలక్ష్మి మృతి చెందింది. విచారణలో నేరం రుజువు కావడంతో ఇవాళ 1వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి నిందితుడికి జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ మేరకు కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.