ADB: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అధికారులకు రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ అందించిన రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గదర్శకమన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగంలో పేర్కొన్న హక్కులు, కర్తవ్యాలు తెలుసుకుని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో వర్ణ, తదితరులున్నారు.