సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ మేళాలో 10 కంపెనీలు పాల్గొనగా.. 193 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 81 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి బీజేపీ నేత హరీశ్ బాబు నియామక పత్రాలు అందజేశారు.