AP: APPSC గ్రూప్-1 మెయిన్స్ అక్రమాలు తేల్చే విషయంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. సభ్యులుగా బార్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ గంటా రామారావు, నాగార్జున యూనివర్సిటీ పూర్వ వీసీ ప్రొ.రాజేంద్రప్రసాద్ నియమించింది.