తమిళనాడులో అన్నాడీఎంకేకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే సెంగొట్టయన్.. టీవీకే అధినేత విజయ్‌తో భేటీ కావడం రాజకీయంగా కలకలం రేపింది. గత కొంతకాలంగా పళనిస్వామితో సెంగొట్టయన్‌కు విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ను కలవడాన్ని సీరియస్‌గా తీసుకున్న పళనిస్వామి.. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.