సత్యసాయి: కొత్తచెరువు మండలంలోని మసీదుల్లో పనిచేస్తున్న మత పెద్దలు, ముతవల్లిలకు గౌరవ వేతనం కింద రూ. 3.60 లక్షల చెక్కును పంపిణీ చేశారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా ఈ చెక్కులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం పట్ల మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు.