MNCL: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బుధవారం లక్షెట్టిపేట పట్టణంలో పోలీస్ అధికారులు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ మేరకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు.