TPT: పుత్తూరులోని శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామికి 49వ లఘు లక్ష బిల్వర్చన నిర్వహించారు. ఈరోజు రాత్రి జరిగిన జ్యోతి పూజలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను స్వాగతించి ప్రత్యేక పూజలు నిర్వహించి, మర్యాదపూర్వకంగా ఆతిథ్యమిచ్చారు.