MBNR: జడ్చర్ల మండలంలోని రామస్వామి గుట్ట తండా ప్రజల చిరకాల కోరిక నేరవేరనుంది. పెద్దదిరాల నుంచి రామస్వామి గుట్ట తండా మీదుగా చిన్నరేవల్లి వరకు 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి ఈ రోడ్డును మంజూరు చేశారని, నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.