టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ శుభవార్తను ఆది ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 2014లో అరుణ అనే అమ్మాయిని ఆది పెళ్లి చేసుకోగా.. వారికి కూతురు పుట్టింది. తాజాగా వచ్చే జనవరిలో తన భార్య బిడ్డకు జన్మనివ్వనుందని, తాము ముగ్గురం నుంచి నలుగురం కాబోతున్నామని తెలుపుతూ ఫొటో షేర్ చేశాడు. దీంతో వారికి నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.