GNTR: పొన్నూరు మండల పరిధిలోని వల్లభరావుపాలెం MPPS (ST), MPUPS పాఠశాలలను పొన్నూరు మండల విద్యాధికారి ధూపం రాజు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో పాఠశాలల్లోని విద్యార్థుల, ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిస్టర్లను, రికార్డులను ఆయన పరిశీలించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.