GDWL: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 29న గద్వాల ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో జిల్లాలోని దివ్యాంగులు పాల్గొనాలని కోరారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు.