TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీటిని తప్పనిసరిగా జత చేయాలి. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి ఫొటో, క్యాస్ట్, నో డ్యూస్, బర్త్ సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్ అటాచ్ చేయాలి. అఫిడవిట్లో అభ్యర్థి, ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి. డిపాజిట్ అమౌంట్(SC, ST, BCలకు రూ.1000, జనరల్‌కు రూ.2,000) చెల్లించాలి. ఎన్నికల ఖర్చు డిక్లరేషన్‌ను సమర్పించాలి.