MDK: వరి కొయ్యలు కాల్చి వేయడం వల్ల భూసారం దెబ్బ తినడమే కాకుండా భవిష్యత్ తరాలకు వ్యవసాయాన్ని ప్రశ్నార్ధకం చేసే అనేక నష్టాలు పొంచి ఉన్నాయని వెల్దుర్తి వ్యవసాయ అధికారి ఝాన్సీ అన్నారు. మండల కేంద్రంలోని పలు వ్యవసాయ పొలాల వద్ద రైతులకు వరి కొయ్యలు కాల్చడం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారుల సూచలను పాటించాలని పేర్కొన్నారు.