KNR: వెన్నంపల్లి హైస్కూల్లో స్నేహిత టీం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఎంఈఓ రవీంద్ర చారి పాల్గొన్నారు. బాలికలు గుడ్ టచ్- బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలని, సమస్యలు ఎదురైతే తల్లిదండ్రులు, టీచర్లకు లేదా కంప్లైంట్ బాక్స్ ద్వారా తెలపాలని ఆయన సూచించారు. స్నేహిత బృందం పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు.