దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ తెంబా బవుమా సంచనాలు నమోదు చేస్తున్నాడు. 27ఏళ్ల తర్వాత తన జట్టుకు తొలి ఐసీసీ టైటిల్ అందించిన తొలి SA కెప్టెన్గా ఆయన నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా సిరీస్ విజయంతో 25 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిపించిన కెప్టెన్ అయ్యాడు. 12 మ్యాచుల్లో 11 విజయాలు, 1 డ్రాతో విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా ఉన్నారు.