కృష్ణా: ఉగాదిలోపు గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ పోతురాజు కోరారు. గురువారం చల్లపల్లి ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ లక్ష్యాలు వివరించారు. నూతన గృహాలు నిర్మించుకునే అర్హులైన పేదలు ఈ నెలాఖరులోపు దరఖాస్తులను గ్రామ సచివాలయంలో సమర్పించాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ఈఈ ఎస్.వెంకటేశ్వరరావు, ఏఈ ధర్మా పాల్గొన్నారు.