హైదరాబాద్‌లో వచ్చే నెల 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, ఆనంద్ మహీంద్రా, UAE రాయల్ ఫ్యామిలీ సభ్యులు, అంతర్జాతీయ టెక్ కంపెనీల CEOలు, పెట్టుబడిదారులు అలాగే స్టార్టప్ ఫౌండర్లు ఈ సదస్సులో పాల్గొననున్నారు.