SDPT: ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 35 మందికి కోర్టు రూ. 3,55,000/- జరిమానా విధించినట్టు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీరిలో ఒక వ్యక్తికి ఏడు రోజులు, మరొక వ్యక్తికి మూడు రోజులు చొప్పున ఇద్దరికి జైలు శిక్ష పడింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.