TPT: తెనాలికి చెందిన రామకృష్ణ కిలారి అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. అనంతరం దాత, కుటుంబ సభ్యులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.