HYDలో ‘అఖండ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన నటుడు ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. బాలకృష్ణతో కలిసి పనిచేయాలంటే మొదట భయపడినట్లు తెలిపాడు. అయితే, ‘షూటింగ్ ప్రారంభమయ్యాక తెలిసింది.. బాలయ్య ఎంత కూల్‌గా, అప్యాయంగా ఉంటారో. ఆయనతో కలిసి మళ్లీ పనిచేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతినిస్తుంది’ అని పేర్కొన్నాడు.