కండోమ్‌లు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారని.. ఓ సర్వే వివరాలు బయటపెట్టింది. దాద్రానగర్ హవేలీలో అత్యధికంగా ప్రతి 10వేల జంటల్లో 993 మంది పురుషులు కండోమ్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఏపీలో 10 వేల జంటల్లో 978 మంది ఉపయోగిస్తూ.. రెండో స్థానంలో నిలిచింది. 960మందితో పుదుచ్చేరి మూడోస్థానంలో ఉంది. కుటుంబనియంత్రణ చేయించుకోని జంటలపై మాత్రమే ఈ సర్వే నిర్వహించారు.