‘అఖండ 2’ సినిమాకు సంగీతం అందించే అవకాశం దొరకడం చాలా అదృష్టమని తమన్ అన్నాడు. ఈ సినిమాలో శివుడి రూపంలో బాలకృష్ణ పడిన కష్టం చూస్తే తన కళ్ళలో నీళ్లు వచ్చాయని తెలిపాడు. మైనస్ 14 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా బాలయ్య ఏమాత్రం వెనుకడుగు వేయకుండా నటించారని ప్రశంసించాడు. ‘శివుడి రూపంలో బాలయ్యను తెరపై చూసినప్పుడు, ప్రేక్షకులు చేతులెత్తి దండం పెడతారు’ అని తమన్ చెప్పుకొచ్చాడు.