GNTR: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరులో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం జిల్లా దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు దుర్గాభాయి తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖల దివ్యాంగ ఉద్యోగులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. వికలాంగుల క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.