ప్రకాశం: ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు మార్కాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 60 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, గర్భిణీ స్త్రీలకు రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలు నిలబడతాయని డా. కిరణ్ అన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.