W.G: కాళ్ల మండలం కాళ్లకూరులో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శుక్రవారం సాయంత్రం సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉండగా ఇచ్చిన రూ.10 లక్షల నిధులతో ఈ రోడ్డు పూర్తయిందని తెలిపారు. అలాగే రూ. 35 లక్షల వ్యయంతో జిందాల్ పవర్ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయనున్న వాటర్ పైప్ లైన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.