MBNR: నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎస్పీ జానకి శుక్రవారం కారుకొండ , నవాబ్ పేట నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియ, ప్రజల రాకపోకలు, భద్రతా పరిస్థితులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు.