ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా విధించింది. పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ బ్యాంకుపై రూ.91 లక్షల ఫైన్ విధించినట్లు ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు మన్నకృష్ణ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు కూడా రూ.3.10 లక్షల జరిమానా విధించింది. వినియోగదారుల లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.