‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో బాలకృష్ణ తన పవర్ఫుల్ స్పీచ్తో ఆకట్టుకున్నారు. తన కొత్త సినిమా #NBK111 (వర్కింగ్ టైటిల్)లోని డైలాగ్తో అభిమానులను ఉర్రూతలూగించారు. ‘చరిత్రలో చాలామంది ఉంటారు. కానీ, చరిత్రను తిరగరాసి మళ్లీ చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే ఉంటాడు. నేనే చరిత్ర.. నాదే ఆ చరిత్ర’ అని డైలాగ్ చెప్పారు.