NDL: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 24 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం దొర్నిపాడు మండలం గుండుపాపుల గ్రామం సందర్శించారు. కలెక్టర్ రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ వంటి పథకాల లబ్ధి అందుతున్న విధానంపై రైతులను అడిగి తెలుసుకున్నారు.