HNK: GWMC పరిధిలోని కరీమాబాద్ శాంతినగర్ ప్రాంతంలో బర్నింగ్ ప్లాట్ఫామ్, సీసీ రోడ్ల మధ్యలో ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ పనులను శుక్రవారం కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా నగరంలో హరితవనాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్క కాపాడాలని అధికారులకు ఆదేశించారు.