NTR: యూటీఎఫ్ సబ్జెక్ట్ నిపుణులు రూపొందించిన SSC స్టడీ మెటీరియల్ను నందిగామ డీవైఈవో ఏ.శ్యామసుందరరావు ఆవిష్కరించారు. విద్యార్థుల ఉత్తీర్ణతకు ఇది ఉపయోగకరమని ఎంఈవో తెలిపారు. యూటీఎఫ్ నేతలు ఉపాధ్యాయుల సమస్యలను ఎంఈవో దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. పాఠశాలలు స్టడీ మెటీరియల్ను వినియోగించి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.