HYD: జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. ఓ డీసీఎం వెహికల్ రివర్స్ వస్తూ ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనతో రోడ్ నం.51 నుంచి 52 వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.