NZB: బోధన్‌లో ఈనెల 23, 24, 25 తేదీల్లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ముప్కాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఇన్నోవేటివ్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ బ్యాగ్స్ ఎగ్జిబిట్ ప్రాజెక్ట్‌కు రెండవ స్థానం లభించగా, మొబైల్ హెల్త్ క్లినిక్- డిజాస్టర్ రిలీఫ్ ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు గంగారాం తెలిపారు.