KKD: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోనున్న కొయ్యవారిపాలెంలో పేకాట నిర్వహిస్తున్నట్లు ఎస్సై నరసింహానికి సమాచారం రావడంతో తన సిబ్బందితో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోనే తీసుకుని వారి వద్ద నుంచి రూ. 8,040 నగదును, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరసింహం తెలిపారు.