GDWL: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. గద్వాల, ధరూరు, గట్టు, కేటీ దొడ్డి మండలాల్లోని 106 జీపీలకు గాను, గురువారం 68 మంది సర్పంచ్ అభ్యర్థులు, 13 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఆయన వివరించారు.