AP: టీచర్లకు ఈనెల 29 నుంచి జనవరి 4 వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉపాధ్యాయులకు క్రికెట్, ఉపాధ్యాయినులకు త్రోబాల్ పోటీలు నిర్వహిస్తారు. ఈ మేరకు రూ.53.95 లక్షలు మంజూరు చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి మండలానికి రూ.5 వేలు, డివిజన్‌కు రూ.20 వేలు, జిల్లాస్థాయికి రూ.20 వేల చొప్పున విడుదల చేసింది.