NLR: నగర పరిసర ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణా, నకిలీ నోట్ల మార్పిడి చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఈ వివరాలు వెల్లడించారు. ఈ ముఠా వద్ద నుంచి సుమారు 22.4 కిలోల గంజాయిని, రూ.37,50,000 విలువ గల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.