AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే అజెండాగా పార్లమెంట్ లో రాష్ట్ర అంశాలు ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా రాబట్టాలని, ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావాలని కోరారు. రైతు సమస్యలకు పరిష్కారం ముఖ్యమని చెప్పారు.