PPM: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచేలా ఉండాలని జిల్లా కలెక్టర్ సి. యస్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం బలిజిపేట మండలం కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలను మెరుగుపరిచే లక్ష్యంతో తనిఖీ చేశానని స్పష్టం చేశారు. సిబ్బంది హాజరును పరిశీలించారు.