NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. వారి నుంచి రూ.11,500 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా పేకాట ఆడితే తమకు సమాచారం అందించాలన్నారు.