MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అధికారులు చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. పలు వాహనాలను తనిఖీ చేసి, రూ.50 వేలు మించి నగదు తీసుకెళ్లవద్దని, తీసుకెళ్తే కచ్చితమైన వివరాలు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి, ఎస్సై లెనిన్ పాల్గొన్నారు.