HNK: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. దామెర క్లస్టర్ పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.