E.G: పంచాయతీరాజ్ శాఖ సంస్కరణలో భాగంగా జిల్లాలో 18 మందిని డిప్యూటీ ఎంపీడీవోలుగా నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం పరిపాలన పర్యవేక్షణకు ఈ నియమకాలు చేపట్టామన్నారు. సీనియర్ గ్రేడ్ 1 కార్యదర్శులు మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి డిప్యూటీ ఎంపీడీవోలు నియమించారు.