PPM: జిల్లా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులలో నిరాటంకమైన వైద్య సహాయం అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగిందని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి గురువారం తెలిపారు. ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ పోస్టర్ను కలెక్టర్ విడుదల చేశారు. జిల్లాలోని వైద్య అవసరాలను ప్రజలందరికీ అందించే విధంగా ఒక దృక్పథం ఉండాలన్నారు.