GNTR: అమరావతిలో పలు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఆమె షెడ్యూల్ విడుదల చేశారు. 9.30 నిమిషాలకు విజయవాడ నోవాటెల్ నుంచి బయలుదేరి 10 గంటలకు అమరావతి CRDA కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.