ELR: కామవరపుకోట మండలం తడికలపూడి హోమియో ఆసుపత్రిని గురువారం రీజనల్ డైరెక్టర్ కుమార్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి త్వరలోనే చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న అటెండర్ స్వీపర్ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని పరిశీలన చేశారు.