NLG: నార్కట్పల్లి మండలం గోపలాయపల్లి గ్రామ సర్పంచ్ స్థానం బీసీ (మహిళ) కు రిజర్వు కావడంతో ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ మచ్చ ముత్యాలు నిన్న ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మచ్చ జయసుధ ముత్యాలు గోపలాయపల్లి సర్పంచు స్థానానికి నామినేషన్ ను దాఖలు చేశారు.